RENIGUNTA ROAD CITY LOCAL NEWS UPDATES
| చిటికెలో జలుబు మరియు దగ్గును తగ్గించే గృహ నివారణలు |
జలుబు మరియు దగ్గు వలన కలిగే సమస్యలు మనల్ని మనశ్శాంతిని కలిగించవు. వీటి నుండి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటాము. ఇక్కడ తెలిపిన ఔషదాలు చిటికెలో ఈ సమస్యను దూరం చేస్తాయి. 1. జలుబు మరియు దగ్గు మన జీవితంలో సాధారణ ఆరోగ్య సమస్యలు. అయినప్పటికీ జలుబును తగ్గించే చాలా రకాల మందులతో పాటూ, కొన్ని రకాల అద్భుతమైన ఔషదాలు జలుబు మరియు దగ్గును తగ్గించుటకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఔషదాలు రోగనిరోధక శక్తిని పెంచి మరియు అవసరమైన స్థాయిలో మ్యూకస్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. 2. పసుపు కలిపిన పాలు మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషదంగా పేర్కొనవచ్చు. పసుపు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను విస్తృతంగా కలిగి ఉంటుంది. కావున, దగ్గు లేదా జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందుటకు పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగండి. 3.రోగనిరోధక శక్తి పెంచుకోటానికి అల్లంను విరివిగా వాడుతున్నారు. అల్లం చాలా సాధారణంగా మన ఇంట్లో ఉండే సహజ ఔషదం మరియు జలుబు, దగ్గులకు విరుగుగా పేర్కొంటారు. అల్లంతో చేసిన వేడి టీ వీటి నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. 4. ఇదొక సులభమైన మరియు విరివిగా వాడే పద్దతి. జలుబును తగ్గించుకోటానికి కేవలం నీటిని తాగటం అనేది చాలా సులువైన పద్దతి. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇంఫ్లేషణ్ ను తగ్గిస్తుంది. రోజు మొత్తం వేడిగా ఉండే నీటిని తరచుగా తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. 5. నిమ్మరసానికి కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి తయారు చేసిన సిరప్ జలుబు నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందుతారు.
| Date :Wednesday, February 7, 2018 2/8/2018 4:14:46 AM
|
|
|
|
|
|
|
| |